ట్రిపుల్ ఆర్ విలన్ ఎవరంటే..?

November 20, 2018


img

రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. సోమవారం సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభించింది. ఇక సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ లు ఒకరికొకరు పోటీగా నటిస్తారని తెలుస్తుంది. ఇదిలాఉంటే సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తాడని లేటెస్ట్ టాక్. రీసెంట్ గా కె.జి.ఎఫ్ సినిమా ట్రైలర్ తో అందరిని మెప్పించిన యశ్ ట్రిపుల్ ఆర్ లో విలన్ గా పర్ఫెక్ట్ అని రాజమౌళి భావించాడట.

వెంటనే అతన్ని కాంటాక్ట్ అవడం అతను ఓకే చెప్పడం అంతా జరిగిందట. రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. అతన్ని తీసుకుని కన్నడలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు ట్రిపుల్ ఆర్ దర్శక నిర్మాతలు. మరి విలన్ గా యశ్ ఎన్.టి.ఆర్, చరణ్ లను ఎలా ఢీ కొడతాడో చూడాలి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.



Related Post

సినిమా స‌మీక్ష