సర్కార్ రికార్డులపై చరణ్ కన్ను

November 20, 2018


img

మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ సర్కార్. రిలీజ్ కు ముందు తర్వాత వివాదాలు ఎలా ఉన్నా సర్కార్ సినిమా వసూళ్లు మాత్రం బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు సర్కార్ వరల్డ్ వైడ్ గా 220 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ పై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఈ సినిమాపై వివాదాలు ఇంకా వసూళ్లను పెంచేలా చేశాయని చెప్పాలి.


ఇప్పటివరకు సౌత్ లో నాన్ బాహుబలి రికార్డులన్ని క్రాస్ చేసి తన సర్కార్ పేరు మీద రాసుకున్నాడు విజయ్. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సర్కార్ రికార్డుల మీద కన్నేశాడు. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న వినయ విధేయ రామ సినిమాతో సర్కార్ రికార్డులను క్రాస్ చేసేందుకు పర్ఫెక్ట్ ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాడు రాం చరణ్. రంగస్థలంతో సత్తా చాటిన చెర్రి ఆ రికార్డ్ మేనియాను వి.వి.ఆర్ తో కూడా కొనసాగించేలా ఉన్నాడు. రీసెంట్ గా రిలీఎజైన టీజర్ అదిరిపోగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చరణ్ సినిమా ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష