సైరాలో అల్లు అర్జున్..?

November 20, 2018


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా భాగమవుతున్నాడట. ఏంటి చిరు సినిమాలో బన్ని కూడా ఉంటాడా అంటే ఆన్ స్క్రీన్ కాదు కాని ఆఫ్ స్క్రీన్ సైరాకు బన్ని సహకారం ఉంటుందట. సినిమాలో కొన్ని చోట్ల బన్ని వాయిస్ ఓవర్ ఉంటుందట. సినిమాలో కీలకమైన అంశాలు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో చెబుతారట. ఆ వాయిస్ బన్ని చేత చెప్పించాలని చూస్తున్నారట.

సురేందర్ రెడ్డి సలహాను చిరంజీవి, రాం చరణ్ కూడా ఓకే చెప్పడంతో సైరాకు మరింత క్రేజ్ ఏర్పడింది. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబడుతుంది. ఉయాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి స్టార్స్ కూడా సైరా నరసిం హా రెడ్డి సినిమాలో నటిస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష