బాహుబలి రైటర్ తమిళ సినిమా

November 20, 2018


img

బాహుబలి సినిమాతో దర్శకుడిగా రాజమౌళి ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో ఆ సినిమా రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ కూడా అంతే గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా నందమూరి మల్టీస్టారర్ గా రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ఓ తమిళ సినిమాకు కథ అందించడం విశేషం. ఆల్రెడీ అట్లీ డైరక్షన్ లో వచ్చిన మెర్సల్ కు మూలకథ ఆయనే అందించారు. ఈసారి పూర్తి కథను అందిస్తూ ఓ తమిళ సినిమా వస్తుంది.

అదే వెల్ వెల్ వెట్రివెల్.. ముందు కార్తి నటిస్తాడనుకున్న ఈ సినిమాలో లారెన్స్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇదో పిరియాడికల్ మూవీ అని తెలుస్తుంది. సినిమా కథ గొప్పగా వచ్చిందని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. బాహుబలి రైటర్ గా దేశం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ తమిళ పరిశ్రమలో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష