నాని నిఖిల్ కలిసి చేస్తున్నారు..!

November 20, 2018


img

నాచురల్ స్టార్ నాని దేవదాస్ సినిమా ఫలితం చూసి మల్టీస్టారర్ సినిమాలు వద్దన్నాడని వార్తలు వచ్చాయి. నాగార్జున, నానిలు కలిసి నటించిన దేవదాస్ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్న నాని తన తర్వాత సినిమా ఇంద్రంగటి మోహనకృష్ణ డైరక్షన్ లో చేస్తున్నాడని తెలుస్తుంది. 

ఈ సినిమాలో నానితో పాటుగా మరో హీరో నిఖిల్ కూడా నటిస్తున్నాడట. నాని, నిఖిల్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా క్రేజీగా మారాబోతుంది. మల్టీస్టారర్స్ వద్దనుకున్న నాని స్క్రిప్ట్ నచ్చి మరి చేస్తున్న సినిమా ఇది. ముద్ర సినిమాతో తన ముద్ర వేయాలని చూస్తున్న నిఖిల్ నానితో కలిసి చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.  



Related Post

సినిమా స‌మీక్ష