96 రీమేక్.. దిల్ రాజు మానేస్తే బెటర్

November 19, 2018


img

విజయ్ సేతుపతి, త్రిష జంటగా ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 96. అక్టోబర్ 4న కోలీవుడ్ లో రిలీజైన ఈ సినిమా అక్కడ సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే రీమేక్ రైట్స్ కొనేసిన దిల్ రాజు అక్కడ హిట్ అయినందుకు సంతోషించినా ఇప్పుడు ఆ రీమేక్ లో నటించే హీరో కోసం వేట మొదలుపెట్టాడు. తమిళ ఆడియెన్స్ ఎలాంటి ప్రయోగాన్నైనా యాక్సెప్ట్ చేస్తారు. 

తెలుగులో కూడా కొన్ని ప్రయోగాలు సక్సెస్ అయినా ఇక్కడ ఎక్కువమంది ఆడియెన్స్ కమర్షియల్ మీటర్ లోనే ఉండటం వల్ల ఎంత ప్రయోగాత్మక సినిమా అయినా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. అయితే 96 విషయంలో దిల్ రాజు ఇక్కడే చిక్కొచ్చి పడ్డది. స్టార్ హీరోతో చేసే స్క్రిప్ట్ కాదు. యువ హీరోలతో అంటే వర్క్ అవుట్ అవుతుందా అవ్వదా అని డౌట్. పోని కథ మార్చేద్దామా అంటే ఫీల్ పోతుందని భయం. 

తమిళ సినిమా చూసిన కొందరు తెలుగు ఆడియెన్స్ మాత్రం 96 సినిమాను రీమేక్ చేయడం కన్నా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం బెటర్ అని సలహా ఇస్తున్నారు. మరి దిల్ రాజు రీమేక్ చేస్తాడా లేక డబ్ చేసి రిలీజ్ చేస్తాడా అన్నది వేచి చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష