సిద్ధమ్మగా నయనతార.. సైరా నుండి క్రేజీ పోస్టర్

November 19, 2018


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా నుండి సిద్ధమ్మ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నరసింహా రెడ్డి భార్య అయిన సిద్ధమ్మ పాత్రలో నయనతార నటిస్తుంది. చిరంజీవికి జోడిగా మొదటిసారి నటిస్తున్న నయన్ సిద్ధం పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.  


Related Post

సినిమా స‌మీక్ష