డిఎస్పి లవ్ లో పడ్డాడా..!

November 19, 2018


img

మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రేమలో పడిన వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారాయి. రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ ఉంటే సినిమా సగం హిట్ అన్నట్టే. తన మ్యూజిక్ తో సంగీత ప్రియులను అలరిస్తున్న దేవి ఓ హీరోయిన్ ప్రేమలో పడ్డాడని టాక్. రంగస్థలం సినిమాలో ప్రకాశ్ రాజ్ కూతురుగా నటించిన పూజిత పొన్నడతో ఆ సినిమా టైంలో క్లోజ్ అయిన దేవి శ్రీ ఆ తర్వాత కూడా ఆమెతో రిలేషన్ కొనసాగించాడట.  


ఇద్దరి వ్యవహారం పెళ్లి దాకా వెళ్లిందని టాక్. అయితే ఇటు డిఎస్పి అటు పూజిత ఎవరు కూడా ఈ విషయం పట్ల స్పందించలేదు. కాని ఇద్దరి మధ్య మ్యాటర్ చాలా దూరం వెళ్లిందని అంటున్నారు. మరి సినిమాల్లో ప్రేమ పాటలతో అలరించే డిఎస్పి తన లవ్ స్టోరీని ఎలా గెలిపించుకుంటాడో చూడాలి. దేవిని కాదనడానికి పెద్దగా కారణాలేవి ఉండకపోవచ్చు మరి పూజిత, దేవిల లవ్ స్టోరీపై అప్డేట్ ఏంటో త్వరలో తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష