త్రివిక్రం మెగాస్టార్ ఫిక్స్ అవ్వొచ్చా..!

November 17, 2018


img

ఖైది నంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా ఏంటో చూపించాడు. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి అంటూ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో సినిమా చేస్తున్నాడు చిరంజీవి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు.  

ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయట. ఇక కొరటాల శివ తర్వాత సినిమా బోయపాటి శ్రీనుతో ఉంటుందని అంటుండగా లేటెస్ట్ గా త్రివిక్రం శ్రీనివాస్ లైన్ లోకి వచ్చాడట. త్రివిక్రం చిరు కోసం ఓ కథ రాసుకున్నాడట. లైన్ వినిపించగానే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కొరటాల శివ తర్వాత త్రివిక్రం మెగాస్టార్ సినిమా ఫిక్స్ అవ్వొచ్చు. అసలైతే చిరు, పవన్ కలిపి మల్టీస్టారర్ తీయాలనుకున్న త్రివిక్రం పవన్ ఎలాగు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు.  Related Post

సినిమా స‌మీక్ష