యాత్ర వాయిదా పడుతుందా..!

November 17, 2018


img

వైఎస్సార్ బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా యాత్ర. సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళయాల స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారని తెలిసిందే. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ యాత్ర మూవీ అసలైతే డిసెంబర్ 21న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. అనుకున్న టైం కల్లా రిలీజ్ రెడీ అయినా అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతుందని తెలుస్తుంది.

ఇయర్ ఎండింగ్ తో పాటుగా క్రిస్ మస్ హాలీడేస్ ను క్యాష్ చేసుకునేలా ఆ డేట్ కు వరుణ్ తేజ్ అంతరిక్షం, శర్వానంద్ పడి పడి లేచే మనసు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి చాలదు అన్నట్టు కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కే.జి.ఎఫ్ సినిమా కూడా డిసెంబర్ 21న రిలీజ్ అంటున్నారు. ఇన్ని సినిమాల మధ్యలో యాత్ర రిలీజ్ అయినా కష్టమే అన్న భావనతో యాత్రం రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. జనవరి చివర్లో యాత్ర రిలీజ్ ఉండొచ్చని తెలుస్తుంది.


అయితే సినిమా రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ డిసెంబర్ 21 అంటూ ఇప్పటికే పోస్టర్స్ రిలీజ్ చేయగా వాయిదా వేస్తున్న విషయాన్ని మాత్రం అఫిషియల్ గా చెప్పలేదు. రిలీజ్ దగ్గరకు వచ్చాక అది ఎనౌన్స్ చేస్తారేమో కాని ఇప్పటికి మాత్రం రిలీజ్ పోస్ట్ పోన్ వార్తలపై చిత్రయూనిట్ స్పందించలేదు.Related Post

సినిమా స‌మీక్ష