మహేష్ గెస్ట్ రోల్..!

November 16, 2018


img

సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ రోల్ గా చేసినా ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరు. ఇంతకీ మహేష్ ఏ హీరో సినిమాకు గెస్ట్ రోల్ గా చేస్తున్నాడు అంటే ప్రస్తుతానికి అది సస్పెన్స్ అంటున్నారు. ఎంబి ప్రొడక్షన్స్ లో ఇప్పటిదాకా తన సినిమాలకు మాత్రమే సమర్పకుడిగా ఉండే మహేష్ బయట హీరోలతో సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. మహేష్ సతీమణి నమ్రత ఈ వ్యవహారాలను చూసుకుంటుందట.

ఇప్పటికే ఓ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందట. దర్శకుడు కూడా సెలెక్ట్ అయ్యాడట. ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ చేస్తాడని తెలుతుంది. దాదాపు సినిమాలో పావుగంట పైగా ఆ రోల్ ఉంటుందట. సినిమాకు ఇంపార్టెంట్ అయిన పాత్ర మాత్రమే కాకుండా సినిమాను టర్న్ చేసే రోల్ కావడంతో మహేష్ కూడా అందుకు సై అన్నాడట. సొంత బ్యానర్ లో సినిమా కోసం మహేష్ చేస్తున్న గెస్ట్ రోల్ ప్లాన్ ఏమాత్రం వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష