కవచం ఆరోజు ఫిక్స్

November 16, 2018


img

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా కవచం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన కవచం టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. పవర్ ఫుల్ పోలీస్ గా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.

డిసెంబర్ 7న కవచం రిలీజ్ చేయబోతున్నారట. ఆరోజు తెలంగాణాలో ఎలక్షన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ఎలక్షన్స్ అడ్డు కాదు అనుకున్నారో ఏమో కాని కవచం సినిమా రిలీజ్ డిసెంబర్ 7న వచ్చేస్తుంది. ఆంధ్రాలో మాత్రం కవచంకు ఎలాంటి ఇబ్బంది లేదు. అల్లుడు శీను నుండి సాక్ష్యం వరకు భారీ బడ్జెట్ సినిమాలైతే చేస్తున్నాడు కాని కమర్షియల్ గా సక్సెస్ అందుకోని బెల్లంకొండ శ్రీనివాస్ కవచంతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. Related Post

సినిమా స‌మీక్ష