సైరా రూమర్స్ ఆగేలా లేవు

November 15, 2018


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా మొదలైన నాటి నుండి అంచనాలతో పాటుగా రూమర్స్ ను ఏర్పరచుకుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. 150 కోట్ల పైగా బడ్జెట్ కేటాయిస్తున్న ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిరుకి అసలు పడటం లేదు అన్న వార్తలు వచ్చాయి. చిరు, సూరిలకు చరణ్ మధ్య సంధి కుదిర్చాడట.  

అయితే ఇప్పుడు మళ్లీ సురేందర్ రెడ్డి వర్క్ చిరుకి నచ్చట్లేదట. చరణ్ లేని టైంలో నిర్మాతగా కూడా చిరు బాధ్యతలు చూసుకుంటుండగా అనవసరంగా ప్రొడక్షన్ కాస్ట్ పెంచుతున్నాడని సురేందర్ రెడ్డి మీద చిరంజీవి ఫైర్ అవుతున్నాడట. సురేందర్ రెడ్డి కూడా ఈ విషయంలో అప్సెట్ అయ్యాడని తెలుస్తుంది. మరి సైరాపై ఈ రూమర్స్ ఇలానే కొనసాగితే సినిమా మీద ఏర్పడిన అంచనాలు తగ్గే అవకాశం ఉంటుంది. మరి చిరు చరణ్ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 



Related Post

సినిమా స‌మీక్ష