రామ రావణ రాజ్యం ఫస్ట్ డే ఎంత తెస్తుందంటే..!

November 15, 2018


img

రాజమౌళి సినిమా చేస్తున్నాడు అంటే ఇప్పుడు కేవలం తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు నేషనల్ వైడ్ గా ఆ సినిమా గురించి చర్చలు మొదలు పెడతారు. బాహుబలితో ఆయన రేంజ్ మారిపోయింది. ఆ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి సూపర్ స్టార్స్ ఇద్దరితో జక్కన్న చెక్కబోతున్న ఆ సినిమా టైటిల్ గా రామ రావణ రాజ్యం అని ప్రచారంలో ఉంది.

ఇక ఈ సినిమా అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డీ భరధ్వాజ్ ప్రస్థావిస్తూ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ 10 వేల స్క్రీన్ లో రిలీజై మొదటిరోజు 200 కోట్లు వసూళు చేస్తుందని అన్నారు. వీకెండ్ కల్లా సినిమా 500 కోట్లు రాబడుతుందని. ఈ సినిమా మరోసారి తెలుగు సినిమా స్టామినా తెలియచేస్తుందని అన్నారు తమ్మారెడ్డి భరధ్వాజ్. డివివి దానయ్య 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష