13 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్నారు

November 08, 2018


img

రచయితగా సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన కోనా వెంకట్ నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు. కోనా కార్పోరేషన్ బ్యానర్ లో ఇప్పటికే నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్ అయ్యింది. లేటెస్ట్ గా కోనా కార్పోరేషన్ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మంచు విష్ణుతో వస్తాడు నా రాజు సినిమా చేసిన హేమంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సినిమా కాస్టింగ్ విషయానికొస్తే స్వీటీ అనుష్క, కోలీవుడ్ మాన్లీ హీరో మాధవన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఈ ఇద్దరు కలిసి 13 ఏళ్ల క్రిందట రెండు అనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో జతకట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్న ఈ సినిమా గురించి త్వరలోనే అఫిషియల్ అప్డేట్ ఇస్తారట. సినిమాకు టైటిల్ గా కూడా సైలెంట్ అని పెడుతున్నారని తెలుస్తుంది. ఈమధ్యనే సవ్యసాచి సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన మాధవన్ స్వీటీ అనుష్కతో చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష