మహేష్ తో అదిరిపోయే కాంబో సెట్ చేస్తున్న అల్లు అరవింద్

November 08, 2018


img

గీతా ఆర్ట్స్ లో ఎప్పుడు మెగా హీరోల సినిమాలే నిర్మిస్తారన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ కొత్తగా బయట హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాతగా మహేష్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మహర్షి సినిమా తర్వత సుకుమార్ డైరక్షన్ లో సినిమా కన్ ఫాం చేసిన మహేష్ ఆ తర్వాత సందీప్ వంగ డైరక్షన్ లో మూవీని లైన్ లో ఉంచాడు.


ఆ సినిమా అల్లు అరవింద్ నిర్మిస్తారని కొన్నాళ్లుగా వస్తున్న వార్త. అయితే అల్లు అరవింద్ డెశిషన్ మార్చుకుని మహేష్ సినిమాను క్రిష్ చేతుల్లో పెట్టాడని తెలుస్తుంది. క్రిష్ మహేష్ కోసం 'శివం' టైటిల్ తో ఓ కథని రాసుకున్నాడు అయితే అది సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆ కథతోనే అల్లు అరవింద్, మహేష్ కాంబో సినిమా ఉంటుందని టాక్. మరి అదే జరిగితే మహేష్.. అరవింద్.. క్రిష్ కాంబో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరెక్ట్ చేస్తున్నాడు.    Related Post

సినిమా స‌మీక్ష