చరణ్ ఫస్ట్ లుక్.. లాస్ట్ మినిట్ చేంజ్..!

November 08, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. 2019 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ దీవాళి కానుకగా రిలీజ్ చేశారు. రిలీజైన ఫస్ట్ లుక్ లో చరణ్ మాసీ లుక్ ఫ్యాన్స్ ను అలరించింది. అయితే రిలీజ్ చేయాల్సిన అసలు లుక్ ఇది కాదని ఫిల్మ్ నగర్ టాక్.

వినయ విధేయ రామ.. సాఫ్ట్ టైటిల్ అది కూడా దీవాళి పండుగ కాబట్టి పట్టు పంచెతో ఉన్న చరణ్ లుక్ తో పోస్టర్ డిజైన్ చేయించారట. ఎలా లీకైందో ఏమో కాని ఫస్ట్ లుక్ గురించి.. చరణ్ స్టిల్ గురించి బయటకు లీకైందట. అందుకే బోయపాటి శ్రీను లాస్ట్ మినిట్ లో ఫస్ట్ లుక్ మార్చేశాడట. చరణ్ మాస్ లుక్ మెగా ఫ్యాన్స్ కొందరికి నచ్చితే.. మరికొందరు మాత్రం చరణ్ పూర్తిగా కనిపించలేదని నిరాశ పడుతున్నారు. అందుకే ఫస్ట్ లుక్ వచ్చిన రెండు రోజులకే టీజర్ వదులుతున్నారు. రేపు అనగా నవంబర్ 9న ఉదయం 10:25 గంటలకు వినయ విధేయ రామ టీజర్ వస్తుంది. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష