నిర్మాతగా మహేష్ సర్వం సిద్ధం

November 08, 2018


img

సూపర్ స్టార్ మహేష్ నిర్మాతగా మారుతున్నాడట. ఆల్రెడీ కొన్నాళ్ల క్రిందట మహేష్ ఎంబి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను రిజిస్టర్ చేయించాడు. మొన్నామధ్య తను నటించిన కొన్ని సినిమాలకు ఎంబి ప్రొడక్షన్ లో సమర్పించారు కూడా. అయితే మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గాడు మహేష్. ఇక లేటెస్ట్ గా మహేష్ ఫుల్ టైం నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే ఎంబి ప్రొడక్షన్స్ లో ఓ కొత్త టీం ఏర్పాటు చేశారట.

ఈమధ్య ఆరెక్స్ 100, చిలసౌ లాంటి ప్రయోగాత్మక సినిమాలు తక్కువ బడ్జెట్ తో వచ్చి హిట్ అందుకున్నాయి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించేలా మహేష్ ఎంబి ప్రొడక్షన్ వేట మొదలు పెట్టిందట. టాలెంట్ ఉన్న దర్శకులు ఎవరైనా వచ్చి తన టీం ను తనని మెప్పిస్తే సినిమా నిర్మించేందుకు రెడీ అంటున్నాడట మహేష్. హీరోగా సూపర్ ఫాం లో ఉన్న సూపర్ స్టార్ నిర్మాతగా ఎలా కెరియర్ కొనసాగిస్తాడో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష