మెగా దీవాళి.. సందడి చేసిన మెగా హీరోస్..!

November 08, 2018


img

పండుగ ఏదైనా తమ అభిమాన హీరో చెప్పే ప్రత్యేకమైన విషెస్ ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇస్తాయి. అయితే అదే హీరోలు అందరు కలిసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. లేటెస్ట్ గా దీవాళి కానుకగా మెగా అభిమానులకు ఓ మెగా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు మెగా హీరోలు. మెగాస్టార్ చిరంజీవి నుండి రీసెంట్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ వరకు అందరు కలిసి సంప్రదాయ దుస్తులతో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.

మెగా హీరోలంతా కలిసి చేసుకున్న ఈ దీవాళి వేడుకలో చిరంజీవి, నాగబాబు, రాం చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ లతో పాటుగా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వైష్ణవ్ తేజ్ తో పాటుగా అల్లు అర్జున్ సోదరుడు బాబి కూడా మెగా వేడుకలో పాల్గొన్నాడు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్ కు అటెండ్ అవని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే మిస్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్రలో ఉన్నారు.     Related Post

సినిమా స‌మీక్ష