విజయ్ సర్కార్ రివ్యూ & రేటింగ్

November 06, 2018


img

ఇళయదళపతి విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా సర్కార్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ కు జంటగా కీర్తి సురేష్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఈ సర్కార్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

కార్పోరేట్ క్రిమినల్ గా పేరు మోస్తున్న సుందర్ (విజయ్) విదేశాల్లో ఉంటూ అక్కడ కంపెనీలను ఆక్రమిస్తూ సంవత్సరానిక్ వేల కోట్ల సంపాదన సాధిస్తుంటాడు. అతను సడెన్ గా ఇండియాకు వస్తున్నాడని తెలిసి ఇక్కడ కార్పోరేట్ సంస్థలు భయపడతాయి. అయితే సుందర్ కేవలం తన ఓటు హక్కుని వినియోగించుకునేందుకే ఇండియాకు వస్తాడు. అయితే ఎన్నికల్లో తన ఓటు గొందల పాలవుతుంది. తన పేరు మీద ఎవరో దొంగ ఓటు వేస్తాడు. ఇది అధికార పార్టీ పనే అని గుర్తించిన విజయ్. కోర్టులో కేసు వేస్తాడు. తనలానే దొంగల పాలైన తమ ఓటు హక్కు వాడుకునేందుకు 3 లక్షల మంది కోర్టులో కేసు వేస్తారు. దానితో ఎన్నికలు రద్ధవుతాయి. మళ్లీ 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్స్ వస్తాయి. ఈలోగా రాజకీయ నాయకుడిగా మారాలనే ఆలోచనతో పాలిటిక్స్ లోకి దిగుతాడు సుందర్. అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి. అధికార పార్టీ అతన్ని ఎలా టార్గెట్ చేసింది..? వాటి నుండి తప్పించుకున్న సుందర్ చివరకు ఏం చేశాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

తుపాకి, కత్తి సినిమాల తర్వాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా అంటే తారాస్థాయి అంచనాలుంటాయి. అయితే ఆ అంచనాలను సర్కార్ అందుకోలేదు. సినిమా మొదలైన కొద్దిసేపటికి కాస్త బాగా అనిపించినా రాను రాను కథనం మరి స్లో అవుతుంది. మొదటి భాగం పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం మరి నెమ్మదిగా సాగుతుంది. 

ఇక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ లానే ఇది కూడా ఉంటుంది. మురుగదాస్ ఇదవరకు సినిమాల్లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, లాజికల్ థాట్స్ ఈ సినిమాలో కనిపించవు సరికదా కొన్ని సందర్భాల్లో ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా సినిమాకు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ కూడా ఆకట్టుకోలేదు.

విజయ్ యాక్షన్, ఫైట్స్, డ్యాన్స్ కోసం అతని ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. అయితే రెగ్యులర్ సిని లవర్స్ కు ఇది నచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా అంచనాలతో వెళ్లి ఈ సినిమా చూస్తే మాత్రం నిరాశ పడక తప్పదు.

నటన, సాంకేతికవర్గం :

సుందర్ రామస్వామి పాత్రలో విజయ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే మురుగదాస్ ఇంకా విజయ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని క్యారక్టరైజేషన్ ఇంకాస్త కొత్తగా రాసుకుని ఉంటే బాగుండేది. కీర్తి సురేష్ కేవలం పాటలకు మాత్రమే అన్నట్టు ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్న కాసేపు పర్వాలేదు అనిపిస్తుంది. రాధారవి, కురియప్ప తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా వారంతా తమిళ ఆర్టిస్టులే వారు బాగానే చేశారు.

సర్కార్ టెక్నికల్ టీం విషయానికొస్తే.. గిరీష్ గంగాధర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వర్క్ సినిమాలో కాస్త బాగుందనిపిస్తుంది. రహమాన్ మ్యూజిక్ అలరించలేదు. సాంగ్స్ మెప్పించలేదు కాని బిజిఎం అలరించింది. ఇక కథ, కథనాల్లో దర్శకుడు మురుగదాస్ తన మార్క్ చూపించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో : 

విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సర్కార్ ఆశించినంతగా లేదు.  

రేటింగ్ : 2/5



Related Post

సినిమా స‌మీక్ష