నిధి అగర్వాల్ మరో లక్కీ ఛాన్స్

November 06, 2018


img

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయినా సరే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. సవ్యసాచి సెట్స్ మీద ఉండగానే అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ అందుకుంది నిధి అగర్వాల్.

ఇప్పుడు లేటెస్ట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో నిధి నటిస్తుందట. మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ ఎంట్రీ షురూ అయ్యింది. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సన డైరెక్ట్ చేస్తున్నాడట. ఈ సినిమాలో విష్ణవ్ సరసన నిధి నటిస్తుందట. అఖిల్ మిస్టర్ మజ్ను తో పాటుగా వైష్ణవ్ తేజ్ మూవీతో నిధి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారనుంది. Related Post

సినిమా స‌మీక్ష