చరణ్ ఊర మాస్.. 'వినయ విధేయ రామ' ఫస్ట్ లుక్..!

November 06, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా ఊర మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. కొన్నళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ టైటిల్ కే చిత్రయూనిట్ ఓకే చేయడం విశేషం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ దీవాళి సందర్భంగా రిలీజ్ చేశారు.


వినయ విధేయ రామ అనే సాఫ్ట్ టైటిల్ పెట్టి చరణ్ ఊర మాస్ లుక్ తో పరుగెత్తించాడు బోయపాటి. ఫస్ట్ లుక్ చూసి మెగా అభిమానులే కాదు సగటు సిని ప్రేక్షకుడు కూడా సినిమాపై అంచనాలు పెంచుకునేలా ఉందని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. చరణ్, బోయపాటి వినయ విధేయ రామ మళ్లీ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష