70 ఏళ్ల ఓల్డ్ మన్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

November 05, 2018


img

కోలీవుడ్ హీరోలు ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటారు. అక్కడ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వస్తున్నా ప్రతి సినిమా ప్రయోగాత్మకంగా చేయాలన్న ఆలోచనతో కెరియర్ ఫుల్ ఫాంలో దూసుకెళ్తున్నాడు యువ హీరో విజయ్ సేతుపతి. హీరో విలన్ అనే తేడా లేకుండా విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈమధ్యనే 96 అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి హిట్ అందుకున్న విజయ్ సేతుపతు ప్రస్తుతం సీతాకాతి సినిమాలో నటిస్తున్నాడు.

బాలాజి థరణిథరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఏకంగా 70 ఏళ్ల ఓల్డ్ మన్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా విజయ్ గెటప్ కు సంబందించిన పిక్స్ లీక్ అయ్యాయి. అచ్చం భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ను తలపిస్తున్న విజయ్ సేతుపతి విలక్షణకు తాను మారు పేరుగా మారేట్టు ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో కూడా నటిస్తున్న విజయ్ సేతుపతి కోలీవుడ్ లో మరో స్టార్ గా అవతరించనున్నాడు.Related Post

సినిమా స‌మీక్ష