చరణ్ వచ్చేది ఆరోజే..!

October 23, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మరో 10 రోజుల టాకీ పార్ట్ తో పాటుగా 2 పాటలు షూటింగ్ చేయాల్సి ఉందట. అయితే సంక్రాంతి బరిలో చరణ్ వస్తాడని చెప్పినా ఈమధ్య ఎలాంటి అప్డేట్ రాకపోయే సరికి సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్నాడని అనుకున్నారు.

కాని చిత్రయూనిట్ మాత్రం సినిమా జనవరి 11న రిలీజ్ పక్కా అంటున్నారు. నవంబర్ ఎండింగ్ కల్లా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో ప్రమోషన్స్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ చేయిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే 2019 సంక్రాంతి బరిలో ఎన్.టి.ఆర్ కథానాయకుడు వస్తున్నాడు. చరణ్ ఆ బయోపిక్ కు ఏమాత్రం పోటీ ఇస్తాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష