సాహో షేడ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్..!

October 23, 2018


img

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈరోజు నుండి మొదలు పెడుతున్నారు. అందులో భాగంగా శాంపిల్ గా షేడ్స్ ఆఫ్ సాహో అంటూ చాప్టర్ 1 ను రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల పెగా బడ్జెట్ తో వస్తున్న ఈ సాహో సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండేలా సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. మరి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 ఎలా ఉంటుందో చూడాలి. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి.Related Post

సినిమా స‌మీక్ష