త్రివిక్రం మళ్లీ నిరాశపరచాడు

October 22, 2018


img

త్రివిక్రం సినిమాల్లో మాటల్లానే ఆ సినిమా వేడుకలకు సంబంధించిన వాటిల్లో కూడా ఆయన మాట్లాడే మాటలు అందరిని అలరిస్తాయి. త్రివిక్రం మైకు పట్టాడంటే ఏం మాట్లాడతాడో అని ఎక్సైట్మెంట్ ఉంటుంది. తెలిసిన విషయాన్నే మనసుని కదిలించేలా చెప్పే టాలెంట్ కొంతమందికే ఉంటుంది. అది త్రివిక్రం కు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్ గా అరవింద సమేత సినిమాతో సక్సెస్ అందుకున్న త్రివిక్రం ఈ సినిమా వేడుకలలో తన ఫ్యాన్స్ ను నిరాశపరచాడు. రిలీజ్ తర్వాత జరిగిన థ్యాంక్స్ మీట్ లో బాగానే మాట్లాడిన త్రివిక్రమ్ సక్సెస్ మీట్ లో మళ్లీ సైలెంట్ అయ్యాడు. 

అక్టోబర్ 2న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రెండు మాటలతో సరిపెట్టగా.. ఆదివారం జరిగిన సక్సెస్ మీట్ లో కూడా కేవలం సినిమాకు పనిచేసిన నటీనటులకు, టెక్నిషియన్స్ కు కృతజ్ఞతలు చెప్పి మైక్ ఇచ్చేశాడు. మాటల మాంత్రికుడు మాటలు రానివాడిగా మారడం అందరిని ఆశ్చర్యపరచింది. సమయానుకూలం లేదు అందుకే మాట్లాడలేదు అన్నది కూడా లేదు. ఈవెంట్ మొత్తం రాత్రి 9:15 కి క్లోజ్ చేశారు. త్రివిక్రం అరవింద సమేత రెండు ఈవెంట్ లలో ఎందుకు మాట్లాడలేదు అన్నది హాట్ న్యూస్ గా మారింది.     Related Post

సినిమా స‌మీక్ష