రణ్ వీర్.. దీపికా.. వెడ్డింగ్ డేట్ ఫిక్స్

October 22, 2018


img

బాలీవుడ్ లో మరో ప్రేమ జంట ఒక్కటవుతుంది. కొన్నాళ్లుగా ప్రేమ పరవశంలో మునిగితేలుతున్న రణ్ వీర్, దీపికా పదుకునేలు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. కొన్నాళ్లు మీడియా కంట పడకుండా ప్రేమాయణం సాగించిన ఈ జంట ఎట్టకేలకు తమ పెళ్లి డేట్ ప్రకటించింది. నవంబర్ 14, 15 తేదీలలో తమ పెళ్లంటూ ఎనౌన్స్ చేశారు రణ్ వీర్, దీపిక.  


ఆన్ స్క్రీన్ పెయిర్.. ఆఫ్ స్క్రీన్ రిలేషన్ కామనే.. లాస్ట్ ఇయర్ నాగ చైతన్య, సమంత మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రణ్ వీర్, దీపికల వంతు వచ్చింది. మా పెళ్లికి ఇరు కుటుంబాల అంగీకారం లభించింది. కొన్నాళ్లుగా మా ప్రేమకు తోడుగా ఉంటున్న వారందరికి థ్యాంక్స్ మీ ప్రేమ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం అంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. 


మొత్తానికి ఇన్నాళ్లు జంట పక్షులుగా కనిపించిన ఈ ఇద్దరు జంట కాబోతున్నారన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఐదేళ్ల క్రితం నవంబర్ 15న రామ్ లీలా సినిమా వచ్చింది. అదే డేట్ న ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. Related Post

సినిమా స‌మీక్ష