ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

October 21, 2018


img

తెలుగు పరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితుడైన వైజాగ్ ప్రసాద్ (75) అక్టోబర్ 21 ఆదివారం తెల్లవారు ఝామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో నిమ్స్ కు తరలించారట.. అయితే హాస్పిటల్ కు చేరిన కొద్దిసేపటికే ఆయన మరణించారని తెలుస్తుంది. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన వైజాగ్ ప్రసాద్ తేజ డైరక్షన్ లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను సినిమాతో లైం లైట్ లోకి వచ్చారు.     

టివి సీరియల్స్ లో బాగా సుపరిచితుడైన వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద్ రావు.  1983లో బాబాయ్ అబ్బాయ్ ఆయన నటించిన మొదటి సినిమా. భద్ర, జై చిరంజీవ, గౌరీ, జానకి వెడ్స్ శ్రీరాం వంటి సీనిమాల్లో వైజాగ్ ప్రసాద్ నటించారు. వైజాగ్ ప్రసాద్ మరణ వార్త విని సిని పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రసాద్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.  


Related Post

సినిమా స‌మీక్ష