భారీ రేటుకి మహర్షి శాటిలైట్ రైట్స్..!

October 19, 2018


img

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా మహేష్ ఫ్రెండ్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న మహర్షి సినిమా శాటిలైట్ రేటు అదిరిపోయింది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ ఛానెల్స్ అన్ని పోటీపడగా జెమిని టివి మహర్షి హక్కులను పొందిందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం 14.5 కోట్లకు మహర్షి శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నారట. ఇది కేవలం తెలుగు వర్షన్ కు మాత్రమే అని తెలుస్తుంది. హింది డబ్బింగ్ రేటు తెలియాల్సి ఉంది. మహేస్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి సినిమా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నారు. 2019 ఏపిల్ 5న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష