సుబ్రహ్మణ్యపురం టీజర్.. సవాల్ విసురుతున్న సుమంత్..!

October 19, 2018


img

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుమంత్ కెరియర్ మొదట్లో కాస్త ఎంటర్టైన్ చేసే సినిమాలు చేసినా ఆ తర్వాత అతను సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆశించిన ఫలితాన్ని మాత్రం అందించలేదు. లాస్ట్ ఇయర్ మళ్లీ రావా సినిమాతో మళ్లీ ఫాం లోకి వచ్చినట్టు కనిపించిన సుమంత్ ఆ ఫాంను కొనసాగించేలా డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే ఇదం జగత్ అనే సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ ఆ సుబ్రహ్మణ్యపురం అంటూ మరో సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేశాడు సుమంత్.

సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో వస్తున్న సుబ్రమణ్యపురం టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. సుబ్రహ్మణ్యపురం ఊళ్లో గుడి చుట్టూ నడించే కథే ఈ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. దేవుడికే సవాల్ విసిరే పాత్రలో సుమంత్ నటిస్తున్నాడు. బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సుమంత్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 





Related Post

సినిమా స‌మీక్ష