సర్కార్ టీజర్.. మురుగదాస్ మార్క్..!

October 19, 2018


img

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సర్కార్. ఈ సినిమాకు సంబందించి టీజర్ దసరా సందర్భంగా రిలీజ్ చేశారు. టైటిల్ కు తగినట్టుగానే రాజకీయాల మీద మురుగదాస్ మార్క్ పంచులేసినట్టు తెలుస్తుంది. టీజర్ లో హీరో క్యారక్టరైజేషన్ తో పాటుగా యాక్షన్ సీన్స్ చూపించారు. సూపర్ ఫాంలో ఉన్న విజయ్ కు ఈ సర్కార్ కూడా తన ఖాతాలో హిట్టు తెచ్చిపెట్టేలా ఉంది.  

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ అయితే అదరగొట్టింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జిల్లా, కత్తి, తుపాకి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి మరి సర్కార్ కూడా వాటి లైన్ లోనే సూపర్ హిట్ సాధిస్తుందో లేదో చూడాలి. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ అవుతుంది. 





Related Post

సినిమా స‌మీక్ష