20 ఏళ్ల క్రితం కథతో నాని

October 19, 2018


img

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా జెర్సీ. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా దసరా రోజున సెట్స్ మీదకు వెళ్లింది. క్రికెట్ ఆట నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ఓ పిరియాడికల్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు గౌతం. 90లలో క్రికెట్ ఫీవర్ ఎలా ఉండేదో అందరికి తెలిసిందే. ఆ టైంలో క్రికెట్ కోసం ప్రాణం పెట్టిన ఓ కుర్రాడి కథే జెర్సీ సినిమా అంటున్నారు.

ఈమధ్య పిరియాడికల్ మూవీలకు బాగా క్రేజ్ పెరిగింది. రంగస్థలం సూపర్ హిట్ కొట్టడంతో కథ, కథనాలు పర్ఫెక్ట్ గా ఉంటే పిరియాడికల్ మూవీస్ కు మంచి సక్సెస్ కొట్టొచ్చని తెలుసుకున్నారు. అందుకే నాని కూడా జెర్సీ సినిమాకు ఓటేశాడు. 20 ఏళ్ల క్రితం కథతో అంటే కచ్చితంగా నాని ఈసారి ఓ సూపర్ హిట్ కొట్టేస్తాడనిపిస్తుంది. ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధంతో నిరాశ పరచిన నాని ఆ తర్వాత వచ్చిన దేవదాస్ సినిమా పర్వాలేదనిపించినా వసూళ్ల పరంగా లాభాలు రాబట్టలేదు. అర్జెంట్ గా నాని ఓ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది జెర్సీతో నెరవేరుతుందో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష