రామ్ సినిమాకు బడ్జెట్ కష్టాలా..!

October 17, 2018


img

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18 అనగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ పై కూడా నోరు విప్పాడు. పిఎస్వి గరుడవేగ హిట్ తర్వాత ప్రవీణ్ సత్తారుతో రామ్ సినిమా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ సినిమాకు తాను అడిగిన బడ్జెట్ కేటాయించాలని చెప్పాడట.

రామ్ తో సినిమా చేయాలనుకున్న ఆనంద్ ప్రసాద్ బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గగా.. సొంత నిర్మాత అయిన స్రవంతి రవికిశోర్ కూడా చేతులెత్తేశాడట. అందుకే ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసిందని తెలుస్తుంది. కథకు అంత బడ్జెట్ అవసరం ఉన్నా రామ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని అంత బడ్జెట్ పెడితే కష్టమని వద్దనుకున్నారట. అయితే రామ్ మాత్రం ఎప్పటికైనా సరే ప్రవీణ్ సత్తారుతో సినిమా చేస్తానని చెబుతున్నాడు.   

 


Related Post

సినిమా స‌మీక్ష