అలాంటి కథతో మహేష్

October 17, 2018


img

సూపర్ స్టార్ మహేష్ తన 25వ సినిమాగా మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమ తర్వాత మహేష్ తన 26వ సినిమాను సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా కథ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని అంటున్నారు. మహేష్ కెరియర్ లో మొదటిసారి చారిత్రాత్మక సినిమా చేసేందుకు సై అన్నాడట.

సుకుమార్, మహేష్ ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేశారు, అయితే ఆ సినిమా అంచనాలకు తగినట్టుగా ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అందుకే ఈసారి మహేష్ కోసం సుకుమార్ పకడ్బందీగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. అసలే రంగస్థలం సూపర్ సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న సుకుమార్ మహేష్ తో కూడా మెమరబుల్ హిట్ కొట్టాలని ఉత్సాహపడుతున్నాడు. మరి ఎలాంటి చారిత్రక కథ ఈ కాంబినేషన్ లో వస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష