అంతరిక్షం టీజర్ వచ్చేసింది..!

October 17, 2018


img

వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అంతరిక్షం. తెలుగులో మొదటిసారి స్పేస్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈరోజు ఆ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ అయ్యింది. వరుణ్ తేజ్ అండ్ టీం చేపట్టిన మిహిర స్పేస్ ప్రాజెక్ట్ లో అనుకోని విధంగా అవాంతరాలు ఎదురవుతాయి. ఈ అడ్డంకులను ఎలా అధిగమించారు అన్నది సినిమా కథ.

క్వాలిటీ విషయంలో సంకల్ప్ రెడ్డి మరోసారి తన టెక్నికల్ స్టామినా చూపించాడని చెప్పొచ్చు. మొదటి సినిమా ఘాజితో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన సంకల్ప్ రెడ్డి అంతరిక్షంతో కూడా అద్భుతాలు సృష్టిస్తాడని టీజర్ చూస్తే తెలుస్తుంది. క్రిష్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి సంకల్ప్ రెడ్డి చేస్తున్న ఈ రెండో ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.

Related Post

సినిమా స‌మీక్ష