విజయ్ మరో బైలింగ్వల్ మూవీ

October 16, 2018


img

నోటా ఫ్లాప్ తో కాస్త ఢీలా పడినట్టు కనిపించిన విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గీతా గోవిందం తర్వాత నోటా కాస్త వెనక్కి నెట్టేసినా తన యాటిట్యూడ్ లో ఏమాత్రం చేంజ్ ఉండదని మెసేజ్ ఇచ్చి తన రౌడీ ఫ్యాన్స్ ను జోష్ లో నింపాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతను చేసిన టాక్సీవాలా రిలీజ్ కు రెడీగా ఉంది. 

మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా మొదలు పెట్టనున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమాతో పాటుగా విజయ్ మరో బైలింగ్వల్ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయట. విజయ్ తో సినిమా కోసం రాక్ లైన్ వెంకటేష్ కొంత అడ్వాన్స్ ఇచ్చారట. నోటాతో ఎలాగు తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కాబట్టి రాక్ లైన్ వెంకటేష్ విజయ్ దేవరకొండతో బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నోటా తెలుగులో డిజాస్టర్ అయినా తమిళంలో మాత్రం పర్వాలేదు అనిపించుకుంది.Related Post

సినిమా స‌మీక్ష