శూర్పణఖ సమంత.. డేర్ స్టెప్

October 16, 2018


img

సౌత్ లో క్రేజీ హీరోయిన్ అయిన సమంత పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలు మానేస్తుందని అన్నారు కాని హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఆమె మరింత ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతుంది. రీసెంట్ గా యూటర్న్ అంటూ వచ్చి ప్రేక్షకులను అలరించిన సమంత ఇప్పుడు మరో సర్ ప్రైజ్ రోల్ లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈసారి కొత్తగా పౌరాణిక సినిమాలో నటిస్తుందట సమంత.  

యానిమేషన్ డైరక్టర్ భార్గవ్ డైరక్షన్ లో రావణాసురుడు చెల్లి శూర్పణఖ ప్రధాన పాత్రగా ఓ సినిమా చేస్తున్నాడట. ఆమె రోల్ లో ముందు కాజల్ ను అనుకోగా ఆమె ఈ సినిమా నుండి డ్రాప్ అయ్యిందట. కాజల్ మిస్ చేసుకున్న ఈ ఛాన్స్ సమంత సొంతం చేసుకుందని తెలుస్తుంది. మరి శూర్పణఖగా సమంత ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ కూడా త్వరలో వెళ్లడిస్తారట.Related Post

సినిమా స‌మీక్ష