పూరితో రామ్.. ఎబ్బే కుదిరేట్టు లేదట..!

October 16, 2018


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ బ్యాడ్ టైం బాగా నడుస్తుంది. వేరే వాళ్లతో ప్రయోగాలు ఎందుకని తనయుడు ఆకాష్ తో మెహబూబా చేసిన పూరి ఆ సినిమాతో కూడా ఫ్లాప్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం యువ హీరోలకు కథలు వినిపిస్తున్న పూరి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే హలో గురు ప్రేమకోసమే ప్రమోషన్స్ లో పూరి సినిమా గురించి రామ్ ను అడిగితే కథ ఇంకా ఫైనల్ కాలేదని అన్నాడు.  

పూరి చెప్పిన లైన్ ఇంకా ఓకే కాలేదని వేరే కథతో మళ్లీ వస్తానని చెప్పారట. వరుస ఫ్లాపులతో ఉన్న పూరితో సినిమా అంటే స్టార్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రామ్ తో పూరి సినిమా ఒకే అయితే రేర్ కాంబినేషన్ అన్నట్టే. ఇక రామ్ కూడా నేను శైలజా హిట్ అందుకున్నా ఉన్నది ఒకటే జిందగి నిరాశ పరచడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.      

నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న హలో గురు ప్రేమకోసమే సినిమాను దిల్ రాజు నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరొయిన్ గా నటించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ అవుతుంది. Related Post

సినిమా స‌మీక్ష