క్రిస్ మస్ పోటీలో ఆ మూడు సినిమాలు

October 16, 2018


img

సంక్రాంతి, దసరాకే కాదు ఈమధ్య ప్రతి ఫెస్టివల్ ను సినిమాలు రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దసరాకి ఇప్పటికే అరవింద సమేత రిలీజ్ అయ్యి హంగామా చేస్తుండగా ఈ గురువారం హలో గురు ప్రేమకోసమే సినిమా వస్తుంది. అదే రోజు విశాల్ పందెం కోడి-2 కూడా రిలీజ్ అవుతుంది. ఇక ఈసారి దీపావళికి కూడా సినిమాల సందడి ఉంది. 

డిసెంబర్ లో కూడా మూడు క్రేజీ మూవీస్ ఒకే రోజున రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. క్రిస్ మస్ కానుకగా ఓ నాలుగు రోజుల ముందే అంటే డిసెంబర్ 21న బాక్సాఫీస్ ఫైట్ లో 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో వైఎస్సార్ బయోపిక్ యాత్ర ఒకటి కాగా శర్వానంద్, సాయి పల్లవి కలిసి హను రాఘవపుడి డైరక్షన్ లో చేస్తున్న పడి పడి లేచే మనసు కూడా ఉంది. ఇక వీటితో పాటుగా వరుణ్ తేజ్ అంతరిక్షం మూవీ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుందో చూడాలి.     Related Post

సినిమా స‌మీక్ష