ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ఏంటంటే..!

October 16, 2018


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రాకపోయే సరికి ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త అసహనంలో ఉన్నారు. ఒకటి రెండు పోస్టర్స్ వదిలినా సినిమాకు సంబందించి ఎలాంటి అప్డేట్ లేదు. అందుకే ప్రభాస్ బర్త్ డే(అక్టోబర్ 23)కు సర్ ప్రైజ్ ఇచ్చేస్తున్నారట.     

ఆ సర్ ప్రైజ్ ఏంటి అంటే టీజర్, ఫస్ట్ లుక్ కాకుండా మేకింగ్ వీడియో వదులుతున్నారట. అది కూడా దుబాయ్ లో షూట్ చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్ కు సంబందించిన మేకింగ్ వీడియో అని తెలుస్తుంది. ఇప్పటికే ఆ రష్ కట్ చేసి ఎక్సైటింగ్ గా అనిపించినవి ఉంచారట. రెడీ టూ అప్లోడ్ అని తెలుస్తుంది. సాహో టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఇది తప్పకుండా గుడ్ న్యూసే.. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న సాహో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష