దర్శకుడే మొదటి ప్రేక్షకుడు : ఎన్.టి.ఆర్

October 15, 2018


img

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా విజయపథంలో దూసుకెళ్తుంది. అక్టోబర్ 11న రిలీజైన ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సిని ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో తన పరిచయం 12 ఏళ్ల నుండి ఉన్నా ఈ సినిమాతో మరింత దగ్గరయ్యాడు. త్రివిక్రం తన పిల్లలకు మామయ్య, తన భార్యకు అన్న, తనకు బావ అన్నాడు ఎన్.టి.ఆర్. ఈ కథ కంటే ముందు రెండు కథలు బాగున్నాయని చెప్పినా వాటిని పక్కన పెట్టి ఈ కథను ఎంచుకున్నాడు త్రివిక్రం. 

సినిమాలో తన నటన గురించి వస్తున్న ప్రశంసలు అన్ని త్రివిక్రం కు దక్కాల్సిందే. నటుడికి దర్శకుడే మొదటి ప్రేక్షకుడు అని అన్నాడు ఎన్.టి.ఆర్. ఇక ఈ సినిమా కోసం కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేశాడని అన్నాడు ఎన్.టి.ఆర్. మొత్తానికి ఎన్.టి.ఆర్ ను త్రివిక్రం.. త్రివిక్రం ను ఎన్.టి.ఆర్ ప్రంశంసించుకుంటూ సక్సెస్ మీట్ సరదాగా సాగించారు.  Related Post

సినిమా స‌మీక్ష