స్టార్ డైరక్టర్ సినిమా కష్టాలు

October 13, 2018


img

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లిస్ట్ లో వి.వి.వినాయక్ కూడా ఉంటాడు. కెరియర్ మొదట్లోనే ఎన్.టి.ఆర్ తో ఆయన చేసిన ఆది సినిమా అదిరిపోయే రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత కూడా దిల్, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, అదుర్స్, ఖైది నంబర్ 150 ఇలా ప్రేక్షకులను అలరించే సినిమాలను డైరెక్ట్ చేసిన వినాయక్ కొన్నాళ్లుగా సక్సెస్ లు లేక సతమతమవుతున్నాడు. అల్లుడు శీను, అఖిల్ ఫ్లాపుల తర్వాత వినాయక్ ఖైది నంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

ఇక అప్పటి నుండి తిరుగులేదు అనుకోగా మళ్లీ మెగా హీరో సాయి ధరం తేజ్ తో ఇంటిలిజెంట్ అని తీసి నిరాశపరచాడు. ఆ సినిమా తర్వాత వినాయక్ ఇక ఖాళీ అయిపోయాడు. స్టార్ హీరోలు వినాయక్ తో సినిమా చేసే సాహసం చేయట్లేదు. స్టార్ డైరక్టర్ గా వినాయక్ ఇప్పుడు సినిమా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈమధ్య బర్త్ డే సందర్భంగా సినిమా ఎనౌన్స్ చేస్తారని ఆశించగా అది కూడా జరుగలేదు. సో వినాయక్ తో సినిమా అంటే హీరో, నిర్మాతలు ముందుకు రావడం లేదని తెలుస్తుంది.

 


Related Post

సినిమా స‌మీక్ష