త్రివిక్రం ఇంతగా మారిపోయాడేంటి..!

October 13, 2018


img

ఒక్క ఫ్లాప్ దర్శకుడిలో ఎంత కసి పెంచేలా చేస్తుంది అని చెప్పడానికి త్రివిక్రంను చూస్తే అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేసిన త్రివిక్రం రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత సినిమాతో తన సత్తా చాటాడు. కథ పాతదే అయినా త్రివిక్రం మార్క్ కనిపించేలా చేశాడు. ఫ్యాక్షన్ కథను అర్ధవంతగా చెప్పేందుకు ప్రయత్నించిన త్రివిక్రంను చూస్తే తన పంథా మార్చుకున్నాడని అనిపిస్తుంది.     

త్రివిక్రం సినిమాల్లో ఎక్కువ కథ కన్నా కథనం మనసులకు దగ్గరయ్యేలా చేస్తుంది. అరవింద సమేత సినిమాలో కూడా ఫ్యాక్షన్ కథే అయినా ఇది త్రివిక్రం మార్క్ అని చాటి చెప్పేలా తీశాడు. రిలీజైన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న అరవింద సమేత సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. రెండు రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 37 కోట్ల దాకా షేర్ రాబట్టి యంగ్ టైగర్ స్టామినా ప్రూవ్ చేస్తుంది.




Related Post

సినిమా స‌మీక్ష