నానితో యూటర్న్ భామ..!

October 13, 2018


img

లాస్ట్ ఇయర్ వరకు వరుసగా ఆరు సూపర్ సక్సెస్ లను అందుకున్న నాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధం తో నిరాశపరచగా కింగ్ నాగార్జునతో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్ కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దేవదాస్ సినిమాలో కథ చాలా వీక్ గా అనిపించింది. నాగార్జున, నానిల కోసం సినిమా ఓసారి చూసేయొచ్చు అనుకున్నా కథ అంత ఎక్సైటింగ్ గా లేకపోవడం నిరాశపరచింది.

అందుకే ఆ సినిమా జస్ట్ యావరేజ్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత నాని ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరక్షన్ లో జెర్సీ సినిమా చేస్తున్నాడు. క్రికెట్ ఆట నేపథ్యంతో సాగే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. కన్నడ భామ అయిన శ్రద్ధ అక్కడ భాషలో వచ్చిన యూటర్న్ సినిమాలో నటించి అలరించింది. ఇక తమిళంలో విక్రం వేద సినిమాలో శ్రద్ధ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే నాని పక్కన ఆమె పర్ఫెక్ట్ పెయిర్ అని శ్రద్ధని తీసుకున్నారు. మరి నానితో శ్రద్ధ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష