అరవింద సమేత శాటిలైట్ రేటు అదిరింది..!

October 12, 2018


img

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత గురువారం రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. పూజ హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ మార్క్ దాటేసిన అరవింద సమేత సినిమా మొదటి రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల షేర్ వసూళు చేయడం జరిగింది.  

ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకి అమ్ముడయినట్టు తెలుస్తుంది. రిలీజ్ ముందు స్టార్ మా, జీ తెలుగు 20 కోట్ల దాకా వచ్చి ఆగిపోగా సినిమాకు వచ్చిన హిట్ టాక్ చూసి జీ తెలుగు 23.5 కోట్లతో అరవింద సమేత సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 35 కోట్ల దాకా రాబట్టిన ఎన్.టి.ఆర్ సినిమా వీకెండ్ లోగా 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష