వర్మ ఏంటి ఇలా షాక్ ఇచ్చాడు..!

October 12, 2018


img

సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈమధ్య సైలెంట్ అయ్యాడేంటి అనుకుంటుండగా లేటెస్ట్ గా మరో సెన్సేషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఎనౌన్స్ చేసిన వర్మ పోస్టర్స్ గట్రా రిలీజ్ చేసి హంగామా చేశాడు. అయితే మధ్యలో అది అటకెక్కేసింది అనుకున్నారు. కాని వర్మ లేటెస్ట్ గా దసరాకు ఆ సినిమా మొదలు పెడుతున్నామని ట్వీట్ చేశాడు. అక్టోబర్ 18న తిరుపతిలో ఆ సినిమా మొదలు పెట్టనున్నారట.


అక్టోబర్ 19న ప్రెస్ మీట్ ఏర్పరచనున్నారట. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో లక్ష్మి పార్వతి ఎపిసోడ్ ముందుదాకా ఉంటుందని.. తాను తీసే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లక్ష్మి పార్వతి ఎంట్రీ నుండే మొదలవుతుందని అంటూ ట్వీట్ చేశాడు వర్మ. మరి వర్మ చెప్పబోయే ఆ నిజాలేంటి.. అసలు వర్మ ఈ సినిమా రిలీజ్ చేస్తాడా.. అంటూ డౌట్లు మొదలయ్యాయి. ఈ సినిమా జనవరి ఎండింగ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు ఆర్జివి.



Related Post

సినిమా స‌మీక్ష