ట్రైలర్ టాక్.. హలో గురూ ప్రేమ కోసమే..!

October 10, 2018


img

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ ఇంప్రెస్ చేయగా ఈ సినిమా నుండి ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. హీరోయిన్ ను ప్రేమలో పడేయాలని తెగ ట్రై చేస్తున్న హీరోకి ఓ అనుకోని స్నేహితుడు తగులుతాడు.

అతనితోనే ఫుడ్డు బెడ్డు షేర్ చేసుకుంటాడు.. ఇలా హీరో అతని మిడిల్ ఏజ్ ఫ్రెండ్ తో కలిసి హీరోయిన్ మనసు మార్చాలని చూస్తారు. మరి అది ఎంతవరకు సాధ్యమైంది అన్నది సినిమా కథ. రామ్ , అనుపమ తర్వాత సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే బాగుంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.   

Related Post

సినిమా స‌మీక్ష