కత్తి సెంటిమెంట్ తో సర్కార్..!

October 10, 2018


img

ఇళయదళపతి విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా అంటే కోలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో అంచనాలు ఉంటాయి. ఇద్దరు కలిసి చేసిన కత్తి, తుపాకి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు సర్కార్ గా విజయ్ తో వస్తున్నాడు మురుగదాస్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ అక్టోనర్ 19న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కు కత్తి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

అదెలా అంటే విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమా ట్రైలర్ అక్టోబర్ 19, 2014లో రిలీజ్ చేశారు. కత్తి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. అదే సెంటిమెంట్ తో అక్టోబర్ 19 దసరా కానుకగా అక్టోబర్ 19న సాయంత్రం 6 గంటలకు సర్కార్ సినిమా రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా నవంబర్ 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

  


Related Post

సినిమా స‌మీక్ష