నిఖిల్ పంచ్ ఆ హీరో మీదేనా..!

October 10, 2018


img

యువ హీరోగా మూడు సినిమాలతో స్టార్ క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండకు నోటా సినిమా పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన నోటా సినిమా విజయ్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలవనుంది. ఇక ఈ సినిమా గురించి విజయ్ ఓ ఓపెన్ లెటర్ రాశాడు. ఓ సినిమా పోయినంత మాత్రాన నా యాటిట్యూడ్ లో మార్పు రాదు. మరో మంచి సినిమాతో మీముందుకొస్తా అని ఓ మెసేజ్ రాశాడు.

అయితే సరిగ్గా విజయ్ మెసేజ్ కి రిప్లై ఇచ్చినట్టే నిఖిల్ యాటిట్యూడ్ మీద చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇంతకీ నిఖిల్ ఏమని ట్వీట్ చేశాడు అంటే ప్రపంచ తన చుట్టే తిరుగుతుందబు అనుకుంటూ లేని యాటిట్యూడ్ ని తన చుట్టూ విసురుతూ ఉంటారు. మిత్రమా నువ్వు మరి అంత ఇంపార్టెంట్ కాదు. ప్రతి యాక్టర్ తనతో తాను పోటీ పడాలి. సినిమా నిర్మాణం అనే సముద్రంలో చిన్న నీటి బొట్టులం మాత్రమే అన్నాడు. హడావిడు తక్కువ చేసి పని ఎక్కువ చేద్దామని నిఖిల్ ట్వీట్ చేశాడు. 

నిఖిల్ ట్వీట్ చూస్తే కచ్చితంగా ఇది విజయ్ కోసం పెట్టిన మెసేజ్ లా అనిపిస్తుంది. దీనితో పాటుగా ఒబామా ఇక అయిపోయింది అంటూ మైక్ కిందపడేసిన జి.ఐ.ఎఫ్ కూడా పోస్ట్ చేశాడు నిఖిల్. Related Post

సినిమా స‌మీక్ష