అరవింద సమేత రెడ్డి ఇక్కడ చూడు ప్రోమో..!

October 09, 2018


img

గురువారం రిలీజ్ అవుతున్న అరవింద సమేత సినిమా ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో చేస్తున్నారు. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఈషా రెబ్బ, సునీల్ కూడా నటించారు.

ఇక ఈ సినిమా నుండి కొద్ది నిమిషాల క్రితం రెడ్డి ఇక్కడ చూడు అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఎన్.టి.ఆర్, పూజా హెగ్దెల రొమాంటిక్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ లో ఎన్.టి.ఆర్ డ్యాన్స్ ఇరగదీశాడని తెలుస్తుంది. జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో పూజా హెగ్దె కూడా అందంగా కనిపిస్తుంది. మరి ఈ రెడ్డి థియేటర్ లో ఎంత సందడి చేస్తాడో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష